సంచలన దర్శకుడు శంకర్ 2 పాయింట్ ఓ చిత్రం నిరాశపరిచిన అనంతరం కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాను తెరక్కేక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని భారీ హంగులతో రూపొందిస్తున్నాడు. ఇక స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.

ఇప్పటికే హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ - కాజల్ అగర్వాల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అలాగే గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంత కాలంగా ఇండియన్ 2 సినిమాలో బాలీవుడ్ హీరో నటించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అజయ్ దేవగన్ నటించే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఆ సంగతి అటుంచితే ఇప్పుడు మరో విలన్ కోసం శంకర్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.  గతంలో అక్షయ్ కుమార్ విలన్ గా సెట్టయినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే అజయ్ దేవ్ గన్ పేరు కూడా వినిపించింది. ఇకపోతే ప్రస్తుతం సౌత్ నుంచి మరో హీరోని విలన్ గా చూపించేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అన్ని బాషల ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేలా శంకర్ స్టార్స్ తో హైప్ క్రియేట్ చేయబోతున్నాడు. మరి ఆయన  ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.