ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్నారు. అమరావతిలో విపక్షాల ధర్నాలు, రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. దీనితో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 

ఇంతటి రాజకీయ వేడిలో శృంగార తార షకీలా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఏంటి.. రాజధానుల గురించి మాట్లాడం ఏంటి అనుకుంటున్నారా.. ఆశ్చర్యపోనవసరం లేదు.. ఎందుకంటే షకీలా ఓ సినిమాలో భాగంగా చెప్పిన డైలాగులు ఇవి. సినిమాలో భాగంగానే షకీలా మూడు రాజధానులపై సెటైర్లు వేసింది.

ప్రస్తుతం షకీలా 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' అనే మూవీలో నటిస్తోంది. టైటిల్ భలే గమ్మత్తుగా ఉంది కదూ. ఈ చిత్రంలో షకీలా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో షకీలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది. 

అందులో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అనే వార్త చదువుతుంది. దాని గురించి తన అసిస్టెంట్ ని అడుగుతుంది. అవును మేడం.. జగన్నన్న మూడు రాజధానులు చేసేశాడు అని చెబుతాడు. దీనితో షకీలా 'ఒక్క స్టేట్ కి మూడు రాజధానులా?.. పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యం అవసరం లేదు అంటూ షకీలా తనదైన శైలిలో సెటైర్ వేస్తుంది. 

షకీలా మూడు రాజధానుల గురించి చెప్పిన డైలాగ్ తో ఈ టీజర్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ చిత్రం దాసరి సాయిరాం దర్శకత్వ పర్యవేక్షణలో.. సతీష్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సీహెచ్ వెంకట్ రెడ్డి నిర్మించారు.  టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.. 

"