బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ షూటింగ్ లో గాయపడ్డారు. తెలుగులో ఘన విజయం సాధించిన 'జెర్సీ' సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ సందర్భంగా హీరో షాహిద్ కపూర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి ఊహించని విధంగా వచ్చి షాహిద్ ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్రం గాయమైంది.

'జబర్దస్త్' కమెడియన్ బెడ్రూమ్ టాపిక్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

షాహిద్ పెదవి చిట్లి రక్తం రావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడి పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం కావడానికి సమయం పడుతుందని.. వాపు తగ్గే వరకు కనీసం నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్ కి సూచించారు.

దీంతో సినిమా షూటింగ్ ని ఐదు రోజుల పాటు నిలిపివేశారు. ఆ తరువాత నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు.