స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ క్రమంగా రాష్ట్రాల హద్దులు దాటుతోంది. ఇప్పటికే బన్నీ తెలుగులో తిరుగులేని హీరో. మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి బన్నీ అల వైకుంఠపురములో చిత్రంతో వచ్చి తిరుగులేని హిట్ అందుకున్నాడు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ మరో విభిన్న ప్రయోగానికి సిద్ధం అయ్యాడు. సుకుమార్ దర్శత్వంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

ఇక డాన్సులలో బన్నీకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. అలా వైకుంఠపురములో చిత్రంలో బన్నీ బుట్టబొమ్మ సాంగ్ కు వేసిన స్టెప్ ని సెలెబ్రిటీలంతా ఫాలో అయిపోతున్నారు. బాలీవుడ్ మెరుపుతీగ దిశా పటాని బన్నీ ఈ డాన్స్ నీకు ఎలా సాధ్యం అని అడిగేసింది. తాజాగా మరో క్రేజీ బాలీవుడ్ హీరో అల్లు అర్జున్ డాన్స్ పై కామెంట్స్ చేశాడు. 

ఆ హీరో మరెవరో కాదు.. షాహిద్ కపూర్. షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్న సందర్భంలో ఆయా అభిమాని అల్లు అర్జున్ గురించి అడిగాడు. దీనికి షాహిద్ కపూర్.. అల్లు అర్జున్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపాడు.