కరోనా కారణంగా దేశ అంతా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. మహమ్మారి భయంతో లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశంలొ పరిస్థితి అదుపులో ఉన్నట్టుగానే చెపుతున్నా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోగుల కోసం వీలైనన్ని ఎక్కువ బెడ్‌లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే ఈ విసయంలో సెలబ్రిటీలు కూడా తమ వంతు సాయం అధించేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌, ముంబైలోని తన ఆఫీస్‌ బిల్డింగ్‌ను కరోనా అనుమానితులను క్వారెంటైన్‌ చేసేందుకు వినియోగించుకోవాలని ముంబై మున్సిపల్ అధికారులకు అంధించాడు. అయితే బిల్డింగ్ ను తీసుకున్న అధికారులు 22 మంది పేషెంట్లు ఉండేందుకు అనువుగా ఆ బిల్డింగ్‌ లో ఏర్పాట్లు చేశారు. పూర్తి మార్పులు చేసిన తరువాత బిల్డింగ్ ఎలా ఉందో చూపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్‌. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.