రిలీజ్ దగ్గరపడుతున్నాకొద్ది జవాన్ మ్యానియా గట్టిగా పెరుతుతుంది. సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.దాంతో జవాన్ కలెక్షన్స్ పై .. మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
రిలీజ్ దగ్గరపడుతున్నాకొద్ది జవాన్ మ్యానియా గట్టిగా పెరుతుతుంది. సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.దాంతో జవాన్ కలెక్షన్స్ పై .. మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan)తాజా చిత్రం జవాన్ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈసినిమాపై భారీ అంచనాలు పెరగిపోతున్నాయి. టికెట్ల విషయంలో కూడా భారీ ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇక కుర్రకారును మించి హ్యాండ్సమ్ నెస్ తో.. దూసుకుపోతున్నాడు షారుఖ్. 60కి దగ్గరలో ఉన్న స్టార్ హీరో.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకుంటున్నాడు.
రీ ఎంట్రీలో జోరు చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). జీరో సినిమా డిజాస్టర్ అయిన తరువాత నాలుగైదేళ్లు సినిమాలకుగ్యాప్ ఇచ్చాడు షారుఖ్. ఈ గ్యాప్ లో.. షారుఖ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక ఈమధ్య పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్.. ప్లప్ ల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ కు ఊపిరులూదారు. ఈక్రమంలో ఆయన తాజాగా జవాన్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈసినిమాతో ఈసారి సౌత్ ను టార్గెట్ చేశారు షారుఖ్.
సౌత్ డైరెక్టర్ అట్లీ ఈమూవీని తెరకెక్కిండం, నయనతార హీరోయిన్ గా నటించడం.. అనిరుధ్ సంగీతం అందించడంతో.. సౌత్ లో కూడా ఈసినిమాపై భారీగా అంచనాలుఉన్నాయి. అందులో తమిళంలో ఎక్కువగా ఈసినిమాపై ఇంట్రెస్ట్ పెట్టారు జనాలు. ఇక ఈ నేపథ్యంలో జవాన్ కోసం అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్ (Advance Ticket Bookings)ఈరోజు ప్రారంభమయ్యాయి. పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత.. రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో.. జవాన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జవాన్ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవ్వగానే.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) సోషల్ మీడియా రిపోర్ట్ ప్రకారం.. బుకింగ్స్ ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఏకంగా 42 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. టికెట్ రేట్లు 15 వందల నుంచి హైయ్యెస్ట్ 2500 వరకూ వెళ్ళినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఫ్యాన్స్ బ్లాక్ లో 10 వేలకైనా టికెట్ కొనడానికి రెడీగా ఉన్నారట. ఇక జవాన్ మూవీ మొత్తం PVR, INOXలో 32,750 టికెట్లు, సినీపోలిస్‌లో 8,750 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది.
