షారుఖ్ ఖాన్-రవితేజ్ మల్టీ స్టారర్.. మనసులో మాట బయట పెట్టిన దర్శకుడు
కొన్ని కాంబినేషన్లను వెండితెరపై ఊహించడం కష్టం. అటువంటి కాంబోలు సడెన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటాయి.అటువంటి కాబోనే ఒకటి త్వరలో సెట్ అయ్యేలా ఉంది. ఇంతకీ ఎంటా కాంబినేషన్ తెలుసా..?

మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు బిజీలో ఉన్నాడు, ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తున్నాడు అందుకే ప్రమోషన్ల విషయంలో జోరు మీద ఉన్నాడు. చాలా చాలా బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీతో కలిసి రవితేజ నార్త్ లో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ముంబైలో పింక్ విల్లాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాస్ మాహారాజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అంతే కాదు అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా రవితేజ సమాధానం చెప్పారు. అందులో ముఖ్యంగా రవితేజ్ బయోపిక్ గురించి ప్రశ్నలు అడిగారు. అయితే బయోపిక్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు రవితేజ. తన బయోపిక్ టైటిల్ అంటూ ఆలోచిస్తుండగా.. మాస్ మాహారాజా అంటూ అభిమానులు అరిచారు. దీంతో అదే టైటిల్ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. అంతే కాదు తన బయోపిక్ లో తానే హీరోగా నటిస్తానని చెప్పారు.
ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ముంబయ్ లో ప్రెస్ మీట్ కాబట్టి.. పనిలో పనిగా.. టైగర్ నాగేశ్వారరావు డైరెక్టర్ వంశీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు రవితేజ, షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని తెలిపాడు. డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ… తనకు రవితేజ, షారుఖ్ ఇద్దరితో కలిసి సినిమా చేయాలని ఉందని.. అది కూడా హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్ తరహాలో వీరిద్దరిని నెగిటివ్ షేడ్స్ లో చూపించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ వంశీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.