ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, పలు షారూఖ్‌ చిత్రాలకు సహా నిర్మాత, షారూఖ్‌ అత్యంత సన్నిహితుతు కరీమ్‌ మొరాని. ఈ బడా నిర్మాత తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. తన కూతురు షాజా మొరానీకి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా ప్రకటించాడు కరిమ్‌. ఈ విషయాన్ని ఆయన పీటీఐతో మాట్లాడుతూ ధృవీకరించారు.

ఇటీవల షాజా శ్రీలంక నుంచి ముంబై వచ్చింది. అయితే మార్చి తొలి వారంలో వచ్చిన ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయితే షాజా సోదరి జోయకు కాస్త కరోనా లక్షణాలు కనిపించటంతో వారిద్దరు టెస్ట్ చేయించుకున్నారు. జోయా కూడా మార్చి 15 వరకు రాజస్థాన్‌లో ఉండి వచ్చింది. అయితే అనుమానం వచ్చిన జోయాకు నెగెటివ్‌ వచ్చినా ఆమెను క్వారెంటైన్‌లో ఉంచారు. ఇక ఎలాంటి లక్షణాలు లేకపోయినా షాజా మాత్రం కరోనాకు పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది అని వెల్లడించారు.

కరీమ్‌ మోరానీ 1991లో రిలీజ్‌ అయిన యోధా సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమాలో సంజయ్ దత్‌, సన్ని డియోల్‌లు హీరోలుగా నటించారు. తరువాత  రా ఒన్‌, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌, దిల్ వాలే లాంటి షారూఖ్‌ సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటికే బాలీవుడ్‌ లో కనికా కపూర్ వ్యవహారం సంచలనంగా మారగా ఇప్పుడు మొరానీ కూతుళ్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.