బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ కారు రోడ్డు ప్రమాధానికి గురయ్యింది. ముంబై లో ఒక ఈవెంట్ నుంచి తిరిగివస్తున్న ఆమె కారుకు ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. కారులో ఉన్న ఆమె భర్త జావేద్ అఖ్తర్‌ కి సైతం పలు గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు దెబ్బలు తీవ్రంగా తగలకపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు.

ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ హైవేలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ పార్టీ కోసం శుక్రవారం ముంబై వెళ్లిన ఈ దంపతులు బాలివుడ్ సెలబ్రెటీలను కలుసుకొని శనివారం స్వగృహానికి తిరిగి పయనమయ్యారు. అయితే ఈ ప్రయాణంలో వారికి చేదు అనుభం ఎదురయ్యింది. శనివారం మధ్యాహ్నం వారి కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. చిన్నపాటి దెబ్బలతో దంపతులు క్షేమంగా బయటపడ్డారు.

వెంటనే షబానా - జావేద్ లను సమీప ఆస్పత్రిలో చేర్పించిన బంధువులు మీడియాకు వివరణ ఇచ్చారు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ఘటన గురించి తెలుసుకున్న బాలీవుడ్ సినీ తారలు ఈ దంపతులను చూసేందుకు హాస్పిటల్ కి బయలుదేరారు. ఆమె క్షేమంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని మరికొందరు సోషల్ మీడియా ద్వారా అభిమానాన్ని చాటుకుంటున్నారు.