సౌత్ ఇండియన్ సీనియర్ సింగర్, సంగీత్ విద్వాంసుడు కేజే.ఏసుదాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల నుంచి కనిపించకుండాపోయిన ఆయన సోదరుడు అకస్మాత్తుగా మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. ఏసుదాసు సోదరుడైన కేజే జస్టిన్ విఘాత జీవిగా నిర్మానుషమైన ప్రదేశంలో శవంగా కనిపించరు.

వివరాల్లోకి వెళితే.. కేజే జస్టిన్కేరళలోని కోచికి దగ్గరలోని థ్రిక్కాకారలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గత మంగళవారం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. రోజులు గడుస్తున్నా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చాలా మంది సన్నిహితులను ఆరా తీశారు. ఎవరు తమ వద్దకు రాలేదని చెప్పిన తరువాత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో జస్టిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇంతలో ఒక చెరువులో గుర్తు తెలియని శవాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించగా అతను జస్టిన్ అని నిర్ధారించారు. అయితే ఇది హత్య? లేక ఆత్మహత్య అనే విషయంలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సోదరుడి మరణంతో ఏసుదాసు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.