సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ దర్బార్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వేగంగా సినిమాలు చేస్తున్న తలైవా రాజకీయాల్లోకి కూడా రాబోతున్నట్లు టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో గాని రాజకీయాలతో సంబంధం లేదన్నట్లు గ్యాప్ లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. దీంతో అభిమానుల్లో గత కొంత కాలంగా కన్ఫ్యూజన్ నెలకొంది.  

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రజినీకాంత్ రీసెంట్ గా కోలీవుడ్ కమర్షియల్ దర్శకుడు శివతో ఒక సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిసెంబర్ లో మొదలు కానుంది. ఆ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల మొదలయ్యాయి. దర్శకుడు శివ రజినీకాంత్ తో మొదటిసారి వర్క్ చేస్తుండడంతో సినిమా క్యాస్టింగ్ పై ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు.

సినిమాలో ఒక ముఖ్య పాత్రలో సీనియర్ హీరో సూర్య సతీమణి జ్యోతిక నటించనుందట.  అలాగే మరో పాత్రలో సీనియర్ నటి మంజు వారియర్ కూడా కనిపించబోతోంది. సీనియర్ హీరోయిన్ జ్యోతిక పెళ్లి అనంతరం చాలా వరకు స్టార్ హీరోలతో నటించడం మానేశారు. ఇక గతంలో సూపర్ స్టార్ తో ఆమె చంద్రముఖి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా జ్యోతిక కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 14 ఏళ్ల అనంతరం మళ్ళీ రజినీకాంత్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.