కరోనాతో సీనియర్ నటుడు మృతి.. విషాదంలో ఇండస్ట్రీ
ఇప్పటికే ఈ మహమ్మారి లక్షమందికిపైగా ప్రాణాల్ని బలితీసుకుంది. పలువురు సెల్రబిటీలు కూడా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి మరణించారు. తాజాగా మరో సీనియర్ నటుడ్ని పొట్టన పెట్టుకుంది ఈ వైరస్. ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) కరోనా వైరస్ కారణంగా మృతిచెందారు. ఆయన గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా పని చేస్తున్నారు. 1970ల్లో టెలివిజన్‌లో ప్రసారం అయిన ది గుడీస్ షోతో ఆయన పాపులర్ అయ్యారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ చదుకునే సమయంలోనే బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.
టీమ్‌కు కరోనా సోకిన తరువాత ఆయన కోలుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనుకుంటున్న తరుణంలో ఆయన మరణవార్త రావటంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు. హాస్య నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రకు జీవం పోసిన టిమ్ మరణం సినీ రంగాని తీరని లోటు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.