ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. చెన్నైలో శ్రీను మాస్టర్ గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీను మాస్టర్ తన కెరీర్ లో 1700 చిత్రాలకు పైగా డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. 

శ్రీనుమాస్టర్ 70వ దశకంలోనే చిత్ర పరిశ్రమలో గుర్తింపు సొంతం చేసుకున్నారు. భక్తకన్నప్ప, మహాబలుడు, యగంధర్, ఎదురులేని మనిషి చిత్రాలకు శ్రీను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. శ్రీను మాస్టర్ తన కెరీర్ లో శ్రీరామరాజ్యం, స్వర్ణకమలం, రాధాగోపాలం చిత్రాలకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. 

ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన హీరాలాల్ శిష్యుడిగా శ్రీను మాస్టర్ ఎదిగారు. శ్రీను మాస్టర్ జన్మస్థలం కర్నూలు జిల్లాలోని ఆదోని. శ్రీను మాస్టర్ అనేక క్లాసిక్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. శ్రీను మాస్టర్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.