తెలుగుతో పాటు సౌత్ లో ఎన్నో భాషల్లో నటించిన అందాల నటి సితార. ప్రస్తుతం తల్లి క్యారెక్టర్స్‌లో నటిస్తున్న ఈ నటి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లాక్‌ డౌన్‌ సందర్భంగా వైరల్‌గా మారింది. స్వతహాగా మలయాళీ అయిన ఈమె ను కెరీర్‌ స్టార్టింగ్‌లో అంతా తెలుగమ్మాయే అని అనుకుంటున్నారు. 1986లో వెండితెరకు పరిచయం అయిన సితార తరువాత తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ఎక్కువగా సెంటిమెంట్ పాత్రల్లోనే కనిపించిన సితారను ప్రతీ ఒక్కరు తమ కుటుంబ సభ్యురాలిగా భావించేవారు. అంతాగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోయింది ఈ నటి.

అయితే తెలుగు ప్రేక్షకులకు ఇంతగా సుపరిచితురాలైన ఈమెకు పెళ్లి కాలేదన్న విషయం చాలా మందికి తెలియదు. 50 కి చేరువవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవటంపై ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సితారకు చిన్నతనం నుంచి తన తండ్రితో ఎటాచ్‌ మెంట్ చాలా ఎక్కువట. ఆమె సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా తనకు సంబంధించిన విషయాలన్నీ తండ్రి దగ్గరుండి చూసుకునేవాడు. దీంతో పూర్తిగా ఆమె తండ్రి మీద డిపెండ్‌ అయిపోయింది.

అయితే సితార కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా ఆమె తండ్రి ఆకస్మాత్తుగా మరణించటంతో ఆమెకు ప్రపంచమంతా శూన్యంగా మారిపోయింది. దీంతో చాలా కాలం పాటు సినిమాల్లో కూడా నటించలేదు. ఆ తరువాత అదే బాధలో చాలా కాలం పాటు ఉన్న ఆమెకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదట. అయితే భవిష్యత్తులో ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీడియాకు తెలియజేస్తానని కూడా చెప్పింది సితార.