టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ళ భరణి రైటర్ గా పలు సినిమాలకు మాటలు అందించారు. అలాగే 2012లో మిథునం అనే సినిమాకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక చాలా కాలం తరువాత ఆయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'అద్భుతహ' అనే టైటిల్ తో ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు కూడా దాదాపు ఎండింగ్ కి వచ్చినట్లు సమాచారం. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలని త్వరలో తెలియజేయనున్నారు.  మిథునం సినిమా తరువాత భరణి ఒక డివోషనల్ మూవీ తీయాలని అనుకున్నారు.

భక్త కన్నప్ప స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు.  సునీల్ తో తీయాలని అనుకున్నట్లు అప్పట్లో ఒక టాక్ అయితే నడిచింది. ఎందుకో కొన్ని వారల తరువాత మళ్ళీ తనికెళ్ళ భరణి చప్పుడు చేయలేదు. ఇక ఇప్పుడు కొత్త నటీనటులతో అద్భుతహా అనే కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది, మరీ ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.