Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ ఇంగ్లీష్ లోనే ? : శేఖర్ కమ్ముల,చైతు చిత్రం టైటిల్!

శేఖర్ కమ్ముల గతంలో డాలర్ డ్రీమ్స్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమా చేసారు. ఈ క్రమంలోనే ఈ సారి సింపుల్ గా ఉండేలా లవ్ స్టోరీ అని పెడితే సరిపోతుందని భావిస్తున్నారట. 

Sekhar Kammula,Naga Chaitanya movie Title
Author
Hyderabad, First Published Oct 31, 2019, 10:49 AM IST

మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఫిధా' తో తెలుగులో పేరు తెచ్చుకున్న  సాయి పల్లవి చైతు సరసన నటిస్తోంది.  మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెర మీద ఆవిష్కరించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై  అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో, సిని పరిశ్రమలో ఈ వార్త వినిపిస్తోంది.

శేఖర్ కమ్ముల గతంలో డాలర్ డ్రీమ్స్, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమా చేసారు. ఈ క్రమంలోనే ఈ సారి సింపుల్ గా ఉండేలా లవ్ స్టోరీ అని పెడితే సరిపోతుందని భావిస్తున్నారట.  రీసెంట్ గా మజిలీ అంటూ హిట్ కొట్టిన నాగచైతన్య తాజా చిత్రం కావటంతో ... ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. కూల్ యూత్ఫుల్ ఎంటర్టెయినర్ గా రూపొందుతోంది.

ఎన్టీఆర్ కి ఎదురుచెప్తావా..? అంటూ ఆట పట్టించేవారు: గీతాంజలి

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ  ‘ విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాస ని నాగ చైతన్య బాగా ఇష్ట పడి నేర్చుకున్నాడు.నాగ చైతన్య పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయి పల్లవి ఈ కథ కు పెర్ఫెక్ట్ గా సరిపోతుంది. నా సినిమాలలో మ్యూజిక్ బలం గా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింత గా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమా కు మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘ అన్నారు.

ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ  ని  ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.  మూడు షెడ్యూల్లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలకమైన సీన్స్  షూటింగ్  జరుగుతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios