టాలీవుడ్ లో  శేఖర్ కమ్ముల విభిన్నమైన శైలి కలిగిన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సున్నితమైన ఎమోషన్స్ తో ఉంటాయి. ఆయన చిత్రాల్లో సంభాషణలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. శేఖర్ కమ్ముల చివరగా ఫిదా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  

ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ చిత్రం చేస్తున్నారు. సామాజిక అంశాలపై  కమ్ముల ముందుటారు. కరోనా నివారణ కోసం ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలంతా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

కానీ శేఖర్ కమ్ముల మాత్రం విభిన్నంగా అలోచించి తన ప్రత్యేకత చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ జెండర్లు నిస్సహాయులుగా మారారు. దీనితో శేఖర్ కమ్ముల ట్రాన్స్ జెండర్లకు సాయం చేశారు. శేఖర్ కమ్ముల మీడియాకు దూరంగా ఉండే వ్యక్తి. శేఖర్ కమ్ముల చేసిన ఈ సాయం గురించి ఎవరికీ తెలియదు. 

స్వయంగా ఓ ట్రాండ్ జెండర్ సోషల్ మీడియా ద్వారా తన కమ్యూనిటీ తరుపున ఈ విషయాన్ని తెలియజేసింది. శేఖర్  ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. అవసరమైన వారికి సాయం చేయడంలో శేఖర్ సర్ ముందుటారని మరోసారి నిరూపించుకున్నారు. టాలీవుడ్ నుంచి మరింతమంది తమని ఆదుకుంటారని భావిస్తున్నట్లు రచన అనే ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.