విక్టరీ వెంకటేష్ ఈ వయసులో కూడా దూసుకు ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ఎఫ్2 చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో వెంకీ తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

బాబీ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతుకు జోడిగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, వెంకిమామ టైటిల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. 

త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగవంతం చేసింది. నవంబర్ 16 వెంకిమామ చిత్రం నుంచి 'ఎన్నాళ్లకో' అంటూ వెంకటేష్, పాయల్ రాజ్ పుత్ మధ్య సాగే డ్యూయెట్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సాంగ్ తో 20 ఏళ్ళు వెనక్కి అని చిత్ర యూనిట్ పేర్కొంది. బహుశా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఏఈ పాటని చిత్రీకరించి ఉండొచ్చు. 

ఈ సందర్భంగా వెంకటేష్, పాయల్ రాజ్ పుత్ ఉన్న అందమైన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా, నాగ చైతన్య ఆర్మీ సైనికుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. 

దర్శకుడు బాబీ పవర్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత బాబీ తెరకెక్కించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ తో జైలవకుశ చిత్రం రూపొందించి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం వెంకటేష్, చైతుతో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.