గత కొన్నేళ్లుగా మంచి రేటింగ్ తో బుల్లితెరపై దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్. పోటీగా వేరే ఛానల్స్ లో ఎన్ని  పుట్టుకొచ్చినా జబర్దస్త్ ని డీ కొట్టలేకపోయాయి. ఇక షో రేంజ్ పెరుగుతున్న కొద్దీ వివాదాలు కూడా ఆ డే స్థాయిలో పుట్టుకొచ్చాయి. ఎవరెన్ని కామెంట్స్ చేసినా మాస్ ఆడియెన్స్ అనే కాకుండా క్లాస్ ఆడియెన్స్ కూడా జబర్దస్త్ స్కిట్ లకు అలవాటు పడిపోయారు.

ఇక రీసెంట్ గా నాగబాబు తప్పుకోవడం జబర్దస్త్ వివాదం మరింత వైరల్ అయ్యింది. అసలు విషయంలోకి వస్తే.. సీనియర్ దర్శకులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ కామెడీ షోపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. ఇంత ఛండాలమైన షో ఎలా సక్సెస్ అయ్యిందని అన్నారు. గతంలో ఒకసారి మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన దగ్గరికి వచ్చి జబర్దస్త్ స్కిట్స్ ఉన్న సిడిలను ఇచ్చారు.  వాటిని చూసి. వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇంత వరస్ట్ షో నెంబర్ వన్ ఎలా అయ్యిందని అ సిడిని ఇచ్చేశా. జబర్దస్త్ కి సంబందించిన ఒక్క షో కూడా ఇంతవరకు నేను చూడలేదు.

కానీ షో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుందని ముందే విన్నాను. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని షో అది. అలాగే పనికి రాని సినిమాలైనా సీరియల్స్ అయినా సమాజానికి ఏ విధంగా ఉపయోగ పడవని తమ్మారెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక తన చివరి రెండు సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలు తీయడం లేపేశానని అన్నారు.    

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు