సూపర్ స్టార్ మహేష్ బాబు  సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ నెల 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కి గురి చేసినప్పటికీ చిత్ర యూనిట్ జనవరి 11న సినిమా రాబోతుందని మరోసారి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. అదే రోజు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

 

దీంతో సంక్రాంతికి ఎవరి సినిమా అత్యధిక వసూళ్లు అందుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు సినిమాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్ న్యూస్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా 105కోట్ల ధర పలికినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ సినిమా బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో మహర్షి సినిమా కూడా ఇదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. కేవలం పెట్టిన పెట్టుబడిని మాత్రమే వెనక్కి తెచ్చింది. ఇక మరోసారి ప్రీ రిలీజ్ బిజినెస్ లో సెంచరీ దాటించిన మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఏ స్థాయిలో లాభాలని అందిస్తాడో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.