మిల్కీ బ్యూటీ తమన్నా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం ఆమెకి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది. మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో నటించనుంది. దీనికి సంబంధించిన వార్తలు ముందుగానే బయటకి వచ్చాయి.

తాజాగా ఈ పాటలో తమన్నా లుక్ ని పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇందులో తమన్నా మిలిటరీ ప్యాంట్ వేసుకొని స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక 'ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అంటూ సాగే ఈ పాట ఎంతో ఫన్నీగా ఉంటుందని చెబుతున్నారు.

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడట్లేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్

ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకి డాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటలో తమన్నా తన డాన్స్ మూమెంట్స్ తో మెప్పిస్తుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలుస్తుందని టాక్. గతంలో కూడా తమన్నా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది.

అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో 'సరిలేరు'లో ఐటెం సాంగ్ చేయాలని దర్శకుడు అనీల్ రావిపూడి ఆమెని సంప్రదించినప్పుడు తమన్నా వెంటనే ఓకే చెప్పింది. గతంలో అనీల్ రావిపూడి రూపొందించిన 'ఎఫ్ 2' సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.

ఆ చనువుతోనే అనీల్ రావిపూడి ఐటెం సాంగ్ అనగానే అంగీకరించింది. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలానే విజయశాంతి, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.