ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడుతున్నప్పటికీ.. అమెరికాలో మాత్రం ఈ చిత్రం వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ వీకెండ్ రన్ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ తర్వాత గ్రాడ్యువల్ గా డ్రాప్ స్టార్టైంది. అలాగని పూర్తిగా పడిపోలేదు.

ఇప్పటికి అక్కడ కలెక్ట్ చేస్తోంది.  అయితే అది అనుకున్న స్దాయిలో లేదు. అక్కడి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రం మంగళవారం 134 లొకేషన్స్ లో  $27,609 కలెక్ట్ చేసింది. దాంతో మొత్తం $2,196,079 చేరింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ని బట్టి మినిమం మూడు మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేసారు. అయితే ఇది ఇప్పుడు క్వచ్చిన్ మార్క్ గా మారింది.

మహేష్ బాబు గత చిత్రాలైన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలకు వచ్చిన కలెక్షన్లను కూడా సరిలేరు నీకెవ్వరు సాధించలేకపోయింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. అయితే రెండో వారంలో అల.. వైకుంఠపురములో చిత్రానికి వస్తున్న ఆదరణ మహేష్ బాబు చిత్రానికి కరువైంది. దీంతో ఈ చిత్రం లాంగ్ రన్‌లో 3 మిలియన్ క్లబ్‌లో చేరే అవకాశాలు లేనట్టే కనిపడుతోంది.

మరో ప్రక్క ఓవర్సీస్‌లో  ‘అల.. వైకుంఠపురములో..’ తన జోరు చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అమెరికాలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అలాగే విడుదలైన తొలిరోజు(ఆదివారం) ఉదయానికే ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. అలా రోజుకో రికార్డ్ తో దూసుకుపోతోంది. పూర్తి రన్ టైమ్‌లో ఈ సినిమా మూడు మిలియన్ల ని దాటేయటం చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.