ఇన్నాళ్లూ ఓవర్సీస్ కింగ్ గా వెలిగిన మహేష్ బాబును.. అల్లు అర్జున్ దాటేశాడు. మహేష్ చివరి సినిమా ‘మహర్షి’ కనీసం 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో కూడా చేరలేకపోయింది. అక్కడ పెట్టిన పెట్టుబడి వచ్చిన రాబడి ప్రకారం చూస్తే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యిందని ట్రేడ్ లో తేల్చారు. ఇక ఇప్పుడు సంక్రాంతి సినిమాలుగా రిలీజైన  `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో `సరిలేరు నీకెవ్వరు` ప్రీమియర్ కలెక్షన్లను `అల వైకుంఠపురములో` క్రాస్ చేసింది.

ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పట్టింది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు'  కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించటం అక్కడ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ బాబు సినిమాల కలెక్షన్స్ లో ఇలాంటి డ్రాప్ ఇంతకు ముందు కూడా కనిపించింది.  'ఆగడు'.. 'బ్రహ్మోత్సవం' లాంటి పూర్తి డిజాస్టర్ ఫలితం కనిపించింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో మళ్లీ ఆ స్దాయి డ్రాప్ కనిపిస్తోంది. దాంతో  ఓవర్సీస్ లో నష్టాలు తప్పవని  అంటున్నారు. అది ఏ మేరకు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

థమన్ బుట్టలో మహేష్.. దేవికి మరో దెబ్బ?

మరో ప్రక్క ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న  `అల వైకుంఠపురములో`  చిత్రం ఇక్కడ మాత్రమే కాదు యుఎస్ లోనూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో 'అల వైకుంఠపురములో' ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురములో' రికార్డు క్రియేట్ చేసింది.  ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ అంటోంది. సరిలేరు నీకెవ్వరుని దాటిన  'అల వైకుంఠపురములో' సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.