సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరులో ఫేమస్ అయిన డైలాగుల్లో ముందు గా గుర్తొచ్చేది 'రమణ లోడెత్తెలిరా...  లేకపోతే చెక్ పోస్ట్ పడతాది'  ఈ డైలాగ్ థియేటర్లను షేక్ చేసింది. దీన్ని  ప్రస్తుతం మిమ్స్ కు ఎక్కువగా వాడుతున్నారు.  ఇక ఈ డైలాగ్ ఎంత ఫేమస్  అయ్యిందో  ఈ డైలాగ్  చెప్పిన నటుడు కూడా అంతే ఫేమస్ అయ్యాడు. ఆరు పదుల వయసు లో కూడా సిక్స్ ప్యాక్  బాడీ తో ఈ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక ఆ నటుడు బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 
 
జబర్దస్త్ లోని మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ టీం స్కిట్ లో భాగంగా రమణ ను ఫుల్ గా వాడుకున్నారు. అవినాష్ ,కార్తిక్ ..  రమణ లోడెత్తే లిరా బదులు  నన్ను ఎత్తెలిరా అంటూ  రమణ ను ఓ ఆటాడుకున్నారు. ఈవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఈ రమణ స్కిట్ ప్రసారం కానుంది.
 
ఇక రమణ స్కిట్ లోకి ఎంట్రీ ఇవ్వగానే  జబర్దస్త్ జడ్జ్ రోజా రమణా లోడెత్తా లిరా అంటూ డైలాగ్ చెప్పింది. రోజా తోపాటు  ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జడ్జ్ గా యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. ఇటీవలే హిట్ తో ప్రేక్షకులముందుకు వచ్చి  విశ్వక్ కెరీర్ లో మొదటి హిట్ కొట్టాడు.