ప్రస్తుతం దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ ని ఏలుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ప్రతిఒక్కరిని ఆకర్షిస్తోంది. కేదార్ నాథ్ చిత్రంతో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన సారా అలీ ఖాన్ ఆ తర్వాత సింబా అనే చిత్రంలో నటించింది. 

తన గ్లామర్ లుక్స్, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో తర్వాతి తరం స్టార్ హీరోయిన్  అంటూ ఆమెపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం నాజూకైన అందంతో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్ ఒకప్పుడు 90 కేజీలకు పైగా బరువుందంటే నమ్ముతారా.. సినిమాల్లోకి రాక ముందు సారా అలీ ఖాన్ నిజంగానే 90 కేజీల బరువు ఉండేది. 

ఇక నా భర్తతో ఉండలేను.. సోనూ సూద్ ని వింతైన కోరిక కోరిన మహిళ

నటిగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత సారా అలీ ఖాన్ జిమ్ వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ పాటించి నాజూగ్గా మారింది. తాజాగా సారా అలీ ఖాన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. బొద్దుగా ఉన్న తాను జిమ్ కసరత్తులతో ఎలా నాజూగ్గా మారాను, ప్రస్తుతం ఫిట్ గా ఎలా ఉంటున్నానో ఈ విడిపోయోలో పొందుపరిచింది. 

కాలేజ్ డేస్ లో ఉన్న సమయంలో సినిమాల్లో నటించాలని ఉందని మా అమ్మకు చెప్పినప్పుడు.. నువ్వు మొదట నీ ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టి.. ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించు అని చెప్పినట్లు సారా అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సారా బొద్దుగా ఉన్నప్పటి దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Episode 2: From Sara ka Sara to Sara ka aadha 🎃

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on May 30, 2020 at 5:16am PDT