టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ చాలా వరకు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవరు ఊహించని పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో గ్లామర్ తో హీటెక్కించిన వారు కూడా ఇప్పుడు హోమ్లీ పాత్రలతో సరికొత్తగా ఆకర్షిస్తున్నారు. ఇక పొంగల్ బరిలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు.

ఇక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు ఒకేసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. లేడి సూపర్ స్టార్ విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే మరో సీనియర్ హీరోయిన్ టబు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' అమ్మ పాత్రలో కనిపించబోతోంది.  ఈ రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు పొంగల్ బరిలో ఒకేరోజు(జనవరి - 12) రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఆడియెన్స్ ఈ సీనియర్ హీరోయిన్స్ చాలా కాలం తరువాత ఒకేరోజు చూడబోతున్నారన్నమాట.

టబు హిందీలో నటిస్తున్నప్పటికీ విజయ శాంతి మాత్రం చాలా రోజుల తరువాత తెరపై కనిపించబోతోంది. ఎవరికీ వారే స్పెషల్. ఒకరు తల్లి పాత్రలో కనిపించబోతుంటే.. మరొకరు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ పాత్రతో దర్శనమివ్వనున్నారు. మరి ఈ స్పెషల్ పాత్రలు సినిమాలకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.