సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా 'స్లమ్‌డాగ్ హస్బండ్' మూవీ మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ప్రణవి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.
ఏదో ఒక కొత్తదనం లేకపోతే జనం ఆసక్తి చూపించటం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఐడియా లెవిల్ లోనే ఆసక్తి కలిగించే అంశం ఉండాలి. అందుకోసం డైరక్టర్స్, నటులు వెరైటి కథలు కోసం తెగ వెతుకుతున్నారు. తాజాగా కుక్కను పెళ్లి చేసుకున్న కుర్రాడి కథతో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
పాపులర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా ఆ మధ్యన 'ఓ పిట్టకథ' అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న సంజయ్ రావు.. ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... సంజయ్ రావు హీరోగా 'స్లమ్‌డాగ్ హస్బండ్' అనే టైటిల్ తో మరో సినిమా రాబోతుంది. ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా 'స్లమ్‌డాగ్ హస్బండ్' మూవీ మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ప్రణవి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. మోషన్ మోస్టర్‌ను రిలీజ్ చేసిన రానా.. 'స్లమ్‌డాగ్ హస్బండ్' టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ మూవీ పోస్టర్ చూస్తుంటే సరికొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్ ఏఆర్ శ్రీధర్ వస్తున్నట్లు అర్థమవుతోంది. కొన్ని మూఢనమ్మకాలను బేస్ చేసుకుని.. వాటిని వినోదాత్మకంగా తెరకెక్కించాడని అర్దమవుతోంది. మూఢనమ్మకాలతో వివాహాలు ఎలా జరుగుతున్నాయనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని వినికిడి. కొందరికి జంతువులతో పెళ్లి అయిన క్లిప్పింగ్స్‌ను, రాశుల ఫొటోలతో మోషన్ పోస్టర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా చివర్లో 'ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది' అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తికరం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
