భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది. క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. 

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ సానియా సొంతం. గతంలో సానియా మీర్జా ప్రేమ వ్యవహారాలపై అనేక రూమర్లు వినిపించాయి. షాహిద్ కపూర్ బాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు. హ్యాడ్సమ్ లుక్ లో కనిపించే షాహిద్ కపూర్ వలలో చాలా మందే హీరోయిన్లు చిక్కుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు ఇప్పటికి చెబుతుంటాయి. 

షాహిద్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన అందాల భామలు కేవలం సినిమావాళ్లు మాత్రమే కాదు.. ఆ జాబితాలో సానియా మీర్జా కూడా ఉంది. గతంలో సానియా మీర్జా,షాహిద్ కపూర్ మధ్య ఘాటు ఎఫైర్ సాగినట్లు ప్రచారం జరిగింది. దీనితో ఓ ఇంటర్వ్యూలో షాహిద్ తో సాగించిన ప్రేమ వ్యవహారంపై సానియా స్పందించింది. 

ఓ సందర్భంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్.. సానియా మీర్జాని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో షాహిద్ తో ఎఫైర్ నిజమేనా అని సానియాని ప్రశ్నించాడు. షాహిద్ తో ఎఫైర్ నిజమే అన్నట్లుగా పరోక్షంగా అంగీకరించిన సానియా మీర్జా.. కానీ అప్పటి సంగతులు నాకు గుర్తులేవని ఆ దాటవేసింది. 

కరీనా కపూర్ తో షాహిద్ ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే. ఇక విద్యబాలన్ తో కూడా ఈ రొమాంటిక్ హీరో కొంతకాలం ఎఫైర్ సాగించాడు. వీరిద్దరితో బ్రేకప్ తర్వాత షాహిద్ కు సానియా తో పరిచయం ఏర్పడింది. కానీ చాలా తక్కువ కాలం మాత్రమే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. 

షాహిద్ నుంచి విడిపోయాక సానియా మీర్జాకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కావడం అది క్యాన్సిల్ కావడం జరిగింది. అనంతరం సానియా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. 

షాహిద్ కపూర్ తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో క్రేజీ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా, నర్గీస్ ఫక్రి లాంటి హాట్ బ్యూటీ లందరితో షాహిద్ కు ఎఫైర్స్ ఉన్నాయనే ప్రచారం గతంలో జరిగింది. 2015లో షాహిద్ కపూర్ మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకున్నాడు.