విజయ్ దేవరకొండ కెరీర్లో  నిలిచిపోయి, అతన్ని స్టార్ ని చేస్తూ తెలుగుతెరపై కొత్త ఐడెంటీని తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఈ సినిమాకి మరిచిపోలేని విజయాన్ని ఇచ్చాయి. ఈ సినిమాలో తెరపై ఎక్కడా అర్జున్, ప్రీతీ పాత్రలు తప్ప విజయ్ దేవరకొండ, షాలిని పాండే కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన విధానం యూత్ ని కట్టిపడేసింది. అంత బాగా డైరక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా తో మరోసారి విజయ్ దేవరకొండ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.  అయితే ఆ తరుణం వచ్చేసింది. త్వరలోనే తను విజయ్ దేవరకొండను డైరక్ట్ చేస్తానని సైమా అవార్డ్ ల వేదికపై సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు.

 సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుకకు ఈ ఏడాది ఖతర్‌ వేదికైంది. చిరంజీవి, విజయ్‌ దేవరకొండ, కీర్తి సురేశ్‌, దర్శకుడు సందీప్‌ వంగా, సుకుమార్‌, శ్రియ, నిధి అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌ వంటి ప్రముఖ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ ఏడాది సైమా 8వ ఎడిషన్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ నేపధ్యంలో యాంకర్ మంజూష...వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అడిగింది. దానికి విజయ్  ఆప్రశ్నను సందీప్ రెడ్డి వంగ ను అడగమని అన్నారు.  ప్రస్తుతం హిందీలో మరో సినిమా ప్లాన్ చేస్తున్న సందీప్  తన తదుపరి చిత్రంగా చేస్తాను అన్నారు. ఈ వార్త విన్న విజయ్ దేవరకొండ అభిమానులు అప్పుడే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ తమ హీరోకు వస్తోందని మురిసిపోతున్నారు.