యువహీరో సందీప్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన 'నిను వీడని నీడను నేనే' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సందీప్ కిషన్ కెరీర్ కి కాస్త బూస్ట్ ఇచ్చింది. ఆడియెన్స్ ఈ హీరోను మర్చిపోతున్నారు అనుకుంటున్న సమయంలో ఆ సినిమా మళ్ళీ క్లిక్కయ్యేలా చేసింది.

ఇక నెక్స్ట్ కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి అనే కామెడీ ఎంటర్టైనర్ తో రెడీ అవుతున్నాడు. సీనియర్ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇటీవల సాలిడ్ అఫర్ అందింది. శాటిలైట్ - డిజిటల్ రూపంలో తెనాలి రామకృష్ణ సినిమా 3కోట్లను అందించినట్లు తెలుస్తోంది.

సందీప్ గత సినిమాలతో పోలిస్తే ఈ రేటు చాలా పెద్దదనే చెప్పాలి. ఇక ఈ సినిమా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే సినిమాకు సంబందించిన టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సందీప్ డిఫరెంట్ షేడ్స్ లో అలరించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఎండింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అన్ని సాంగ్స్ ని కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. హన్సిక ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా సందీప్ లాయర్ పాత్రలో అలరించినున్నాడు.