టాలీవుడ్ లో మరో సినీ స్టార్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. ఆత్మహత్య చేసుకొని తెలుగు జనాలకి షాకిచ్చిన ఉదయ్ కిరణ్ జీవితాన్ని తెరపైకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచార. అవకాశాలు లేక మనోవేదనకు లోనై బాధతో ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరికి తెలిసిన విషయమే. పరోక్షంగా బడా స్టార్ అతని పతనానికి కారణమయ్యాడని ఎన్నోపుకార్లు వచ్చాయి.

కొంత మంది సినీ ప్రముఖులు ఆ విషయంపై కామెంట్ కూడా చేశారు. ఇకపోతే సినిమాకు సంబందించిన విషయానికి వస్తే.. సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్ పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  కొత్త దర్శకుడు ఇ బయోపిక్ ని డైర్టెక్ట్ చేసే అవకాశం ఉంది. 2020జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్స్ కూడా రెడీ అవుతున్నట్లు టాక్.  చిత్రం(2000) సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఉదయ్ కిరణ్ కెరీర్ మొదట్లోనే వరుస విజయాలతో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 2001వ సంవత్సరంలో నువ్వు నేను - మనసంతా నువ్వే సినిమాలు కూడా క్లిక్ అవ్వడంతో ఉదయ్ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకున్నాడు. అయితే ఆ తరువాత ఉదయ్ కిరణ్ పెద్దగా సక్సెస్ అందుకోలేవు. వచ్చిన మంచి అవకాశాలు కూడా మిస్ అయ్యాయని అప్పట్లో ఒక టాక్ నడిచింది. ఇక మొత్తానికి ఉదయ్ కిరణ్ బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇంకా ఈ విషయం డిస్కర్షన్ లోనే ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.