హైదరాబాద్: ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాలివుడ్ మాత్రమే కాదు ఈ డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు, కన్నడ ఇలా దేశంలోని వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన వారి పేర్లు  బయటపడుతున్నాయి. ఇందులో ప్రముఖంగా వినింపించిన పేరు సంజన గల్రాని. 

అయితే తాజాగా సంజనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కన్నడ న్యూస్ ఛానల్ సువర్ణ బయటపెట్టింది. ఇటీవలే సంజన్ తన మతాన్ని మార్చుకున్నట్లు... ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు ఈ ఛానల్ ప్రసారం చేసింది.  

ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంజన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో వుంది. ప్రస్తుతం బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంజన మతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సువర్ణ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. 

మహిరాగా సంజన ఎలా మారిందంటే...
 
కన్నడ నటిగానే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన సంజన ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే రెండేళ్ల  క్రితమే సంజన్ మహిరాగా మారినట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను కూడా సదరు ఛానల్ ప్రసారం చేసింది. బెంగళూరులోని దారుల్ ఉలుమ్ షా వలిఉల్లామ్ మజీదు ఆమెకు ఇస్లాం స్వీకరించినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ ను సువర్ణ ఛానల్ ప్రసారం చేసింది. అందులో సంజన పేరు మహిరాగా మార్చుకుంటున్నట్లు వుంది. 

అయితే సంజన అజిజ్ పాషా అనే ఇస్లాం మతానికి చెందిన డాక్టర్ ను విహహం చేసుకుంది. వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా సదరు టీవీ ఛానల్ ప్రసారం చేసింది. ఇలా సంజన్ గల్రాని ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు సువర్ణ ఛానల్ దృవీకరించింది.