మాజీ బాయ్ ఫ్రెండ్ మెల్విన్ లూయిస్ తనను బెదిరిస్తున్నాడని నటి సనా ఖాన్ ఆరోపణలు చేస్తోంది. ఆమె హిందీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది. దాదాపు ఏడాది పాటు ప్రేమలో ఉన్న సనా ఖాన్, మెల్విన్ ఇటీవల విడిపోయారు. ఈ విషయాన్ని సనా ఖాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కాగా ఇప్పుడు మెల్విన్.. 'పురుషులు కూడా బాధితులే' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సనా ఖాన్ కి, ఆయనకి మధ్య జరిగిన ఆడియో క్లిప్పింగ్ ని షేర్ చేశారు. అందులో సనా ఖాన్.. 'నువ్ అవమానపడేలా చేస్తాను' అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

మెల్విన్ చేసిన ఈ పోస్ట్ పై స్పందించిన సనా.. ఇది బ్లాక్ మెయిల్ అని.. అతడు షేర్ చేసిన ఆడియో ఫోన్ సంభాషణ అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదని చెప్పింది. అతడికి బ్రేకప్ చెప్పడానికి వెళ్లినప్పుడు ఎదురుగా నిల్చొని మాట్లాడిన ఆడియో అదని చెప్పారు.

దాదాపు రెండు గంటల పాటు అతడికి అర్ధం అయ్యేలా చెప్పినా.. తన మనసు మార్చాలని చూశాడని, కానీ అతడిని భరించే ఉద్దేశం తనకు లేదని.. ఆ సమయంలో మెల్విన్ తన కొట్టాడని.. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పారు.

తన ముఖానికి గాయాలయ్యాయని.. అతడు చాలా వేధించాడని చెప్పింది. 'నువ్ నన్ను ఎలా బాధపెట్టావో ప్రజలకు తెలియజేస్తా.. నువ్ ఏంటో ప్రపంచానికి నిరూపిస్తా' అని చెప్పిన సమయంలో మెల్విన్ రికార్డ్ చేసి.. ఆ వాయిస్ రికార్డ్ ని రిలీజ్ చేశాడని చెప్పుకొచ్చింది.