బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చివరగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. తనకు మాత్రమే సాధ్యమైన విధంగా ఈ చిత్రంలో సంపూర్ణేష్ చెలరేగిపోయాడు.ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు తన నెక్స్ట్ మూవీ మోసం కసరత్తులు మొదలు పెట్టాడు. 

సంపూర్ణేష్ బాబు తన తదుపరి చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సంపూర్ణేష్ బాబు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టాడు. బర్నింగ్ స్టార్ సంపూ జిమ్ లో చెమటలు పట్టేలా కష్టపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

ఈ వీడియోను సంపూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మీరు ఏ ప్యాక్ కావాలో కోరుకోండి.. తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాయి అంటూ సంపూ కామెంట్ పెట్టాడు. ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో సంపూర్ణేష్ బాబు సీరియస్ గానే సిక్స్ ఫ్యాక్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. 

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు దాదాపు 3 నిమిషాల లెంగ్త్ ఉన్న డైలాగ్ ని అలవోకగా చెప్పేశాడు. సంపూర్ణేష్ బాబుపై మొదట్లో సెటైర్లు పడ్డా ఇప్పుడు అతడికి చాలా మందే అభిమానులు ఉన్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాలకు క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. 

ఈ సారి కూడా సంపూ కామెడీ స్పూఫ్ తోనే వస్తాడా లేక కొత్త కథ ట్రై చేస్తాడా అనేది వేచి చూడాలి. సంపూర్ణేష్ బాబు చిన్న సినిమాలు చేస్తున్నప్పటికీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు సాయం అందించడంలో ముందుంటాడు. ఏపీలో తుఫాను వచ్చిన సందర్భంలో సంపూర్ణేష్ ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా సంపూ పాల్గొన్నాడు.