షాక్ : చిరంజీవితో సంపత్ నంది చిత్రం...ఆ సీక్వెల్ ?

 సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యి నెల దాటుతున్నా మంచి హిట్స్ పెద్ద‌గా ఏమి రాలేదు. ఈ స‌మ‌యంలో సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Sampath Nandi To Direct Chiru for a sequel?

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లైన చిత్రాల్లో ఘన విజ‌యం సాధించిన చిత్రం సీటీమార్. ఫస్ట్ వేవ్ అనంతరం తెలుగు సినిమాకు క్రాక్.. ఉప్పెన.. జాతిరత్నాలు సినిమా జోష్ ను అందించాయి. కాని సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యి నెల దాటినా సరైన హిట్ పడలేదు. ఈ టైమ్ లో సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. గోపీచంద్ సుదీర్ఘ కాలం తర్వాత కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకున్నాడు. ఆయన ఈ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న నేపథ్యంలో హీరోగా మరికొంత కాలం కెరీర్ కు ఢోకా లేదు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో గోపీచంద్ కు జోడీగా తమన్నా నటించింది. వీరిద్దరు కూడా కబడ్డీ జట్ల కోచ్ లు గా కనిపించారు. సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి..సంపత్ నందితో సినిమా చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారని వినికిడి.    

వాస్తవానికి  అప్పట్లో  రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసినప్పటి నుంచి చిరంజీవి సంపత్‌ తో సినిమా చేయాలనుకున్నారట. కానీ రకరకాల కారణాలతో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ‘సీటీమార్’సక్సెస్  తర్వాత సినిమా వెంటనే చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారట. దాంతో చిరంజీవి ఇమేజ్ ని బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని సంపత్ ఓ లైన్ వినిపించటానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నారట. చిరు కూడా పూర్తి స్క్రిప్ట్‌ తో రమ్మని కోరినట్లు వినికిడి.

ఇక  చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. దాదాపు అర డజను దర్శకులతో సినిమాలు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.  ఈ వరసలో కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.  పోస్ట్  ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే  ఈ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. 

 ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చాలా యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్  చేస్తున్నారు. దాంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నంది చెప్పిన కథ వినటానికి  చిరు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అది రచ్చకు సీక్వెల్ లాంటి సినిమా అని అంటున్నారు. రచ్చ కొడుకుతో చేసి, రచ్చ సీక్వెల్ తండ్రి తో చేయటం అనేది నిజమైతే అది పెద్ద వింతే..విశేషమే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios