దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజా మోగింది. లెజెండరీ నిర్మాత రామానాయుడు పెద్ద మనువడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ మెడలో తాళికట్టాడు. రామానాయుడు స్టూడియోలో అత్యంత సన్నిహితుల మధ్య ఆగస్టు 8న ఈ వివాహం ఘనంగా జరిగింది. పరిశ్రమ నుండి రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అతికొద్దిమంది మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కావడం జరిగింది. ఐతే ఈ పెళ్లివేడుకలో అక్కినేని వారి కోడలు సమంత ప్రత్యేకంగా నిలిచింది. నాగ చైతన్య భార్యగా సమంత కూడా దగ్గుబాటి కుటుంబానికి చుట్టం అయ్యింది.
 
రానా మెహిందీ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. షెల్ డిటైలింగ్ కలిగిన ఆ ఎల్లో డిజైనర్ వేర్ ధర అక్షరాలా  రూ. 1.59 లక్షలట. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన సమంత డ్రెస్ ధర గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఇక పెళ్ళిలో ఆమె శారీలో దర్శనమిచ్చారు. కాగా రానా-మిహికా పెళ్ళిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దిగిన ఫోటో సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆ గ్రూప్ ఫోటో షేర్ చేసిన సమంత, కొత్త పెళ్లి కూతురుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️ #ranawedsmiheeka ... the most adorable @miheeka 🤗 Welcome to the family ❤️... 📷 @reelsandframes

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 8, 2020 at 12:39pm PDT

'అందమైన మిహికా...కుటుంబంలోకి నీకు స్వాగతం' అని కామెంట్ పెట్టారు. నవ వధువు మిహికాకు సమంత మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకడం పట్ల నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత గ్రేట్ అంటూ ఆ ఫోటోకి లైక్స్ కొడుతూ, కామెంట్స్ పెడుతూ తమ అభిమానం చాటుకుంటున్నారు. సంధర్భానికి  తగ్గట్టుగా స్పందించిన సమంత అందరి మనసులు గెలుచుకుంటుంది.  అలాగే ఆమె కూడా దగ్గుబాటి ఫ్యామిలీలో ఒక భాగంగా భావిస్తుందని అర్థంఅవుతుంది .