ఏ మాయ చేసావే చిత్రంతో చైతు సరసన సమంత రొమాన్స్ పండించింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోవడంతో సమంత సమంతకు మరిన్ని కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. దూకుడు, బృందావనం, అత్తారింటికి దారేది, మనం లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలు సమంత పేరిటి నమోదయ్యాయి. గత ఏడాది రాంచరణ్ సరసన నటించిన రంగస్థలం, మహానటి చిత్రాలు సమంతని నటిగా మరో స్థాయికి చేర్చాయి. 

ఈ ఏడాది సమంత ఓ బేబీ చిత్రంతో హిట్ అందుకుంది. 2017లో సమంత, నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా సామ్ హీరోయిన్ గా రాణిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత తల్లికాబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలని సామ్ ఖండించింది. 

ప్రస్తుతం సమంత 96 రీమేక్ లో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక సామ్ కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకోనుందట. తల్లి కావడం కోసమే సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సమంత, నాగ చైతన్య జంటగా ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.