నాగచైతన్యతో పెళ్లి అయిన తరువాత సమంత తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె సక్సెస్ లు కూడా అందుకుంటోంది. అందుకే అదే బాటలో కంటిన్యూ అవ్వాలనుకుంటోంది. మునుపటిలా టిపికల్ హీరోయిన్ పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే తన స్థాయికి అవి తగవని చెప్పేస్తుంది.

నటిగా ప్రయోగాత్మక సినిమాలు చేసే మూడ్ లో ఉన్న సమంత ఆ కారణంగానే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఓకే చెబుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో 'ది ఫ్యామిలీ మేన్' అనే సిరీస్ సీజన్ 1 విడుదలైంది. మనోజ్ బాజ్పాయ్ నటించిన ఈ సిరీస్ కి ప్రేక్షకాదరణ లభించింది.

ఇందులో మనోజ్ కి భార్యగా ప్రియమణి నటించింది. అలానే కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా ఓ రోల్ లో కనిపించాడు. ఇప్పుడు ఈ సిరీస్ రెండో సీజన్ రాబోతుంది. ఇందులో  సమంత కూడా నటించబోతుందని సమాచారం. ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుందట. ఈ రోల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ఇంతవరకు వెండితెరపై నెగెటివ్ పాత్రలు చేయని సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా తనలోకి కొత్త కోణాన్ని పరిచయం చేయబోతుంది. మరి సమంతను ఆడియన్స్ ఆ విధంగా 
రిసీవ్ చేసుకోగలరో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా.. సమంత త్వరలోనే తన భర్త నాగచైతన్యతో కలిసి సొంతంగా నిర్మాణ సంస్థ మొదలుపెట్టి అందులో వెబ్ సిరీస్ లతో పాటు చిన్న బడ్జెట్ లో సినిమాలు కూడా తీయాలని భావిస్తోంది.