మజిలీ - ఓ బేబీ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న సమంత నెక్స్ట్ 96 రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ లో 96 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి - త్రిషా జంటగా నటించిన ఆ సినిమా టివిలో వచ్చినప్పటికీ థియేటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది.

ఇక ఇప్పుడు తెలుగులో శర్వానంద్ - సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్రిషా స్టైల్ లో సమంత ఫస్ట్ లుక్ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.ఇకపోతే  ఇటీవల సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిసెంబర్ చివరలో ఎండ్ అవుతాయి.

ఇక సినిమాని నెక్స్ట్ ఇయర్ లవర్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.  కానీ ఇప్పుడు మరో కొత్త డేట్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14కి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ కూడా రిలీజ్ కానుంది. దీంతో రెండు ప్రేమ కథ చిత్రాలు క్లాష్ కాకూడదని ఫిబ్రవరి 7న 96 రీమేక్ ని రిలీజ్ చేయాలని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇకపోతే సినిమాకు జానూ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. కథలో ఎలాంటి ఫీల్ మిస్సవ్వకూడదని నిర్మాత దిల్ రాజు అదే దర్శకుడితో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.   ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు.చిత్ర షూటింగ్ తాజాగా ముగిసినట్లు సమంత ఇటీవల సోషల్ మీడియాలో పేర్కొంది. 96 చిత్రంలోని తన స్టిల్ ని పోస్ట్ చేసింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. నా కెరీర్ లో ఇది కూడా ఒక ప్రత్యేక చిత్రం. గతంలో కంటే బాగా నటించేలా ఈ చిత్రంలోని పాత్ర నన్నే ఛాలెంజ్ చేసింది.   ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్, శర్వానంద్ లకు నా ధన్యవాదాలు అని సమంత ఆ ట్వీట్ లో పేర్కొంది.