ఈ ఏడాది సమంత మజిలీ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకుంది. ఆ వెంటనే సమంత నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం ఓ బేబీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 చిత్ర రీమేక్ లో నటిస్తోంది. 

విజయ్ సేతుపతి, త్రిష నటించిన తమిళ చిత్రం 96 అక్కడ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. 

ఈ చిత్ర షూటింగ్ తాజాగా ముగిసినట్లు సమంత సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితమే పేర్కొంది. 96 చిత్రంలోని తన స్టిల్ ని పోస్ట్ చేసింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. నా కెరీర్ లో ఇది కూడా ఒక ప్రత్యేక చిత్రం. గతంలో కంటే బాగా నటించేలా ఈ చిత్రంలోని పాత్ర నన్నే ఛాలెంజ్ చేసింది. 

ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్, శర్వానంద్ లకు నా ధన్యవాదాలు అని సమంత పేర్కొంది. త్వరలో 96 చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.