నయనతార vs సమంత.. మధ్యలో బుక్కైపోయిన స్టార్ హీరో!

నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

samantha akkineni announces her next film with vijay sethupathi and nayanthara titled kaathu vaakula rendu kaadhal

ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. స్టార్ హీరో సమంత, నయనతార, విజయ్ సేతుపతి లాంటి నటీనటులు కలిసి ఓ సినిమా చేస్తుండడం విశేషం. నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు.

అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి లు కలిసి నటించడం ఇదే మొదటిసారి.

నాగ చైతన్య పై రౌడీ బేబీ రొమాంటిక్ ఎటాక్!

అంతేకాదు.. నయనతార, సమంత కలిసి నటిస్తుండడం కూడా ఇదే తొలిసారి. సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు క్రేజీ స్టార్లు కలిసి సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 'కాతు వాకుల రెండు కాదల్' అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ముందుగా నయనతార, త్రిషలను హీరోయిన్లుగా అనుకున్నారు. కానీ ఫైనల్ గా త్రిష స్థానంలో సమంతని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి విడుదల చేసిన చిన్న టీజర్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios