బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరి కుమారుడు, ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ 38 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా మరణించాడు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన్న ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి కన్ను మూశారు.

ఈ విషయాన్ని సల్మాన్‌ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాని అభిమానులకు తెలియజేశాడు. `అబ్దుల్లా తో పాటు దిగిన ఫోటోను సోషల్ మీడియాతో పోస్ట్ చేసిన భాయ్ `ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం` అంటూ ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అబ్దుల్లా మరణ వార్త తెలిసిన సల్మాన్ భాయ్ బోరున విలపించాడు.

అబ్దుల్లా మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలురువు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ స్పందించారు. వ్యక్తిగతంగా బాడీ బిల్డర్‌ అయిన అబ్దుల్లా, సల్మాన్‌ తో కలిసి పలు వేదిక మీద కనిపించాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ బాడీ బిల్డింగ్ విషయంలో ఇద్దరు కలిసి వర్క్‌ అవుట్ చేసేవారు. గతంలో అబ్దుల్లాతో కలిసి జిమ్ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు.