కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ దశాబ్దాలకాలం నుంచి అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లే. సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత 2012లో వచ్చిన దబంగ్ 2 కూడా మంచి విజయం సాధించింది. 

ప్రేక్షుకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో సల్మాన్ ఖాన్ ఈ సిరీస్ లో చిత్రాలని కొనసాగిస్తున్నాడు. శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ 3 చిత్రం రిలీజ్ కు రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో యుఎస్ లో ప్రీమియర్ షోలు పడబోతున్నాడు. 

సల్మాన్ ఖాన్ కు జోడిగా ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ నటించారు. అన్ని ఏరియాలకంటే ముందుగా దుబాయ్(యూఏఈ) లో ప్రీమియర్ షో పడింది. దబంగ్ 3కి యూఏఈ నుంచి టాక్ మొదలైపోయింది. 

సినిమా చూసిన ప్రతి ఒక్కరిని నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా మంచి రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దబంగ్ సిరీస్ లో ఏడేళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. డైరెక్టర్ ప్రభుదేవా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ట్విట్టర్ లో బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్స్ మొదలైపోయాయి. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అంటూ సల్మాన్ ఫాన్స్ సంబరపడుతున్నారు. 

ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో నడిపించాడు. ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ ఎమోషనల్ గా కట్టుకుంటుంది. అసలు గేమ్ ఇంటర్వెల్ నుంచి మొదలవుతుందట. ప్రభుదేవా దర్శత్వంతో, సల్మాన్ నటనతో సెకండ్ హాఫ్ అదరగొట్టిపడేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సయీ మంజ్రేకర్ మధ్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల్లో కండల వీరుడు పాతికేళ్ల కుర్రాడిగా నటించాడు. 

యూఏఈ ప్రీమియర్ షో నుంచి అభిమానుల స్పందన కింది ట్వీట్స్ లో..