బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గురించి మనకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ముంబై మొత్తం అతడి గురించి తెలుసు. అతడి పేరు షెరా.. ఎన్నో ఏళ్లుగా సల్మాన్ వద్ద బాడీగార్డ్ గా పని చేస్తున్నాడు. సల్మాన్ అతడిని తన ఇంటి మనిషిలా చూసుకుంటాడు. 1995లో షెరాను తన బాడీగార్డ్ గా నియమించుకున్న సల్మాన్ అప్పటినుండి ఇప్పటివరకు అతడిని రీప్లేస్ చేయలేదు.

షెరా అంటే సల్మాన్ కి ప్రత్యేక అభిమానం. అన్నేళ్లుగా తనకు రక్షణ కల్పిస్తున్న షెరాకి సల్మాన్ ఎంత జీతం ఇస్తాడో తెలిస్తే షాక్ అవుతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలకు పదిహేను లక్షల చొప్పున సల్మాన్.. షెరాకి జీతమిస్తాడు. ఇవి కాకుండా.. బోనస్ లు, బెనిఫిట్స్ మొత్తం కలుపుకుంటే ఏడాదికి రెండు కోట్లకు పైగానే అన్నమాట. షెరాకి సల్మాన్ అంటే పిచ్చి.

తన తుదిశ్వాస వరకు సల్మాన్ వద్దే ఉంటానని ఓ సందర్భంలో చెప్పారు. తనెప్పుడూ సల్మాన్ పక్కన కానీ, వెనుక కానీ ఉండనని.. సల్మాన్ ముందు ఉంటానని.. ఆయనకి హాని కలిగించేవారు ఎవరైనా ఉన్నారా..? అని ప్రతీక్షణం గమనిస్తూనే ఉంటానని అన్నారు.షెరా కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావాలని సల్మాన్ ఆలోచిస్తున్నారట. షెరా కోసం సల్మాన్ ఓ ఇల్లు కూడా రాసిచ్చాడట.

ప్రస్తుతం సల్మాన్ 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు తన సోదరుడు సొహైల్ ఖాన్‌తో కలిసి ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.