'టైగర్ 3' ఏ Ottలో ... ఎప్పుడు స్ట్రీమింగ్?
సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కొందరు అభిమానులు ఎదురుచూపు మొదలైంది.

సల్మాన్ ఖాన్ ( Salman Khan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్-3’(Tiger 3)ఈ రోజు భారీ ఎత్తున రిలీజైంది. గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూడో భాగానికి మనీశ్ వర్మ(Maneesh Sharma) దర్శకత్వం వహించగా..యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కత్రినా కైఫ్(, Katrina Kaif)..ఇందులోనూ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కొందరు అభిమానులు ఎదురుచూపు మొదలైంది.
ఇక ఈ చిత్రం తన ఓటిటి రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ కు భారీ మొత్తానికి అమ్మింది. ఈ సినిమా ఓటిటిలో రిలీజైన 45 రోజులు అంటే నెల పదిహేను రోజులకు స్ట్రీమింగ్ అయ్యేలా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అంటే దాదాపు డిసెంబర్ నెలాఖరకు క్రిస్మస్ కానుకగా లేదా వచ్చే సంవత్సరం మొదలు కొత్త సంవత్సరం కానుకగా వచ్చే అవకాసం ఉందని సమాచారం.
టైగర్ 3 మూవీ ఈ రోజు (నవంబర్12న) దీపావళి సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్-3 మూవీకి మార్నింగ్ షో నుంచే మిక్స్డ్ టాక్తో రన్ అవుతోంది. అయితే సల్మాన్ ఫ్యాన్స్ నుంచి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయితే టైగర్ 3 మూవీని రీసెంట్గా వచ్చిన షారుఖ్ పఠాన్, జవాన్ మూవీస్తో కంపైర్ చేస్తూ..అంతటి రేంజ్లో లేదంటూ చాలా మంది డిస్సపాయింట్ అవుతున్నారు. కానీ, యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో మాత్రం తగ్గేదేలా లేదనేలా ఉందంటూ...సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.