Asianet News TeluguAsianet News Telugu

#GodFather:కావాలనే బురద జల్లే ప్రయత్నం... ఈ చెత్త ప్రచారాలు?

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన 'లూసిఫర్' సినిమాకు అధికారిక రీమేక్. దసరా సీజన్ లో విడుదల కాబట్టి ఈ సినిమాకు ప్రయోజనం ఉంటుంది. 

Salman Khan is extremely upset with GodFather production?
Author
First Published Sep 19, 2022, 8:40 AM IST


సినిమా స్టార్స్ ఫ్యాన్స్ ఉండేవారు. రిలీజ్ లు అప్పుడు హంగామా చేస్తూ ఎంజాయ్ చేసేవారు. అది ఒకప్పటి సంగతి. ఇప్పుడు ప్రతీ రోజు పండగే అన్నట్లుగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అలాగే  తమ కులం హీరోనే తాము ఆరాధించాలనే రూల్ పెట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే అభిమానులు అరాచకం అని సరిపెట్టుకున్నా...కొన్ని మీడియా సంస్దలు కూడా అదే పంధాలో వెళ్లటం కులాల పరంగానూ విడిపోయారు. తమ కులం హీరో కాకపోతే ..వ్యతిరేక ప్రచారాలు మొదలెట్టడం...రాబోయే సినిమాల మీద బురద జల్లడం చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గాఢ్ ఫాధర్ సినిమా పై కూడా గత కొద్ది రోజులుగా దారుణమైన ప్రచారాలు మొదలయ్యాయి. అవి మెగాభిమానులను భాదిస్తున్నాయి. సామాన్య ప్రేక్షకులను సైతం ఇబ్బంది పెడుతున్నారు.

వివరాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు బిజినెస్ జరగటం లేదని, ఆచార్య ప్రభావంతో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ దూరంగా ఉంటున్నారని ప్రచారం చేస్తున్నారు. 

అదే సమయంలో ఈ సినిమా ప్రొడక్షన్ పై సల్మాన్ ఖాన్ సైతం చాలా అప్ సెట్ అయ్యారని, అందుకే అనంతపూర్ లోజరగనున్న ఈ సినిమా ఈవెంట్ కు రావటం ఇష్ట పడటం లేదనే ప్రచారం మొదలెట్టారు. అయితే ఎక్కడా సల్మాన్ అప్సెట్ అయ్యినట్లు సమాచారం లేదు. ఇది కేవలం ఓ వర్గం కావాలని జల్లుతున్న బురద మాత్రమే అంటున్నారు అభిమానులు. 

మరో ప్రక్క రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారు. ఎంత మొత్తమనేది బయటకు రాలేదుత్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.
  
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios