సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్  చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బడ్జెట్ ని బట్టి కలెక్షన్స్ ని స్పీడ్ గా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. రీసెంట్ గా దబాంగ్ సినిమాను వేగంగా  పూర్తిచేసి వెండితెరపై మరోసారి చుల్ బుల్ పాండే గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓపెనింగ్స్ గట్టిగానే అందుకున్నాడు.

ఆ సినిమా రిలీజ్ కాక ముందే రాధే సినిమాను సెట్స్ పైకి తెచ్చేశాడు. ఈద్ కానుకగా ఆడియెన్స్ కి సినిమాని ఇస్తానని చెప్పిన సల్మాన్ పక్కా ప్లానింగ్ తో రెడీ అయ్యాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే యాడ్స్ తో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే ఇండియన్ సెలబ్రేటిస్ లో సల్మాన్ ఒకరు. రీసెంట్ గా రియల్ మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నట్లు చెప్పిన సల్మాన్ ఒక్కరోజు షూటింగ్ కి 7కోట్ల పారితోషికాన్నీ అందుకున్నట్లు తెలుస్తోంది.

సల్మాన్ సినిమాలకంటే యాడ్స్ తోనే తన ఆదాయాన్ని పెచుకుంటూ వస్తున్నాడు. రియల్ మీ యాడ్ లో నటించడానికి కేవలం ఒక్కరోజు షెడ్యూల్ ని కేటాయించుకున్న సల్మాన్ 7కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు టాక్. ఇక రాధే సినిమాలో సల్మాన్ సరికొత్తగా కనిపించబోతున్నాడట. మెయిన్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం 8కోట్ల వరకు ఖర్చు చేయిస్తున్నాడట. గతంలో బాహుబలి కి వర్క్ చేసిన కొంత మంది విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు కూడా అదే తరహాలో గ్రాఫిక్స్ ని క్రియేట్ చేయబోతున్నారని సమాచారం.