కరోనా ప్రతీ ఒక్కరినీ ఇంటికే పరిమితం చేసేసింది. సామాన్యుల నుంచి స్టార్ హీరోల వరకు అంతా ఖాళీగా ఉన్నారు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైం పాస్ చేస్తున్నారు. కొంత మంది తారలు తమ వర్క్‌ అవుట్ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తుండగా, మరికొందరు తమ ఇంట్లో వంట చేస్తూ, ఇంటి పని చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. మరికొందరు తమ గత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదిక పంచుకుంటున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఆలోచించాడు కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా క్వారెంటైన్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌ తన పాన్వెల్‌ ఫాం హౌస్‌లో ఉంటున్నాడు. ఫ్యామిలీతో కలిసి అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన పెంపుడు గుర్రానికి గడ్డి పెడుతూ తాను కూడా ఆ గడ్డిని తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు వీడియోతో పాటు నా ప్రియమైన దానికితో బ్రేక్‌ ఫాస్ట్ అంటూ కామెంట్ కూడా చేశాడు. ఈ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులతో పాటు పలువురు సినీ తారలు కూడా సల్మాన, మూగ జీవాల పట్ల చూపిస్తున్న ప్రేమకు ముగ్థులవుతున్నారు.

ప్రస్తుతం సల్మాన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కి రాథే సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను కూడా ఫాం హౌజ్‌ నుంచే పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమాను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో అనుకున్నట్టుగా రంజాన్‌కు రిలీజ్‌ అవుతుందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Breakfast with my love...

A post shared by Salman Khan (@beingsalmankhan) on Apr 9, 2020 at 10:44pm PDT