బాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న అతి తక్కువ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. నటనపరంగా ఇతరులకు పోటీ ఇవ్వకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అందరికంటే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకోగల హీరో సల్మాన్. అయితే చాలా రోజుల తరువాత సల్మాన్ ఖాన్ చాలా పూర్ ఓపెనింగ్స్ అందుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

మినిమమ్ మూడు వందల కోట్లు కొడితే గాని సల్మాన్ సైలెంట్ అయ్యేవాడు కాదు. అలాంటిది 100కోట్లు అందుకోవడానికి బాక్స్ ఆఫీస్ వద్ద మొదటిసారి కష్టపడుతున్నాడు. ఇటీవల విడుదలైన దబాంగ్ 3 సినిమా ఊహించని పాజిటివ్ రివ్యూలు అందుకున్నప్పటికీ ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాపై ఆడియెన్స్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు.

ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన రెండో దబాంగ్ కావడంతో దబాంగ్ 3పై మొదట నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఓ వైపు ప్రమోషన్స్ చేస్తూనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఫైనల్ గా రిలీజ్ అనంతరం అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. సాధారణంగా సల్మాన్ సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్ లోనే 100కోట్ల కలెక్షన్స్ తో దర్శనమిస్తాయి.

టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ లో ఇంతవరకు డౌన్ అయ్యింది లేదు. కానీ దబాంగ్ 3 మాత్రం భాయ్ ని గట్టి దెబ్బె కొట్టింది. వీకెండ్ ఎండ్ అయినప్పటికీ సోమవారం మంగళవారం కూడా సినిమా సెంచరీ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. బుధవారం కలెక్షన్స్ బావున్నట్లు టాక్. సో సెంచరీ అయితే కొట్టగలడు కానీ అది లేజీ సెంచరీ అని చెప్పవచ్చు. మరీ టోటల్ గా భాయ్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.