కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కిక్ చిత్రంలో అభిమానులని అలరించారు. ఆ చిత్రంలో జాక్వెలిన్ గౌనుని నోటితో పైకి లేపుతూ సల్మాన్ ఖాన్ చేసిన డాన్స్ మాస్ ప్రేక్షకులని బాగా అలరించింది. ఆ చిత్రంలో సల్మాన్, జాక్వెలిన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. 

తాజాగా మరోసారి ఈ జంట అలరించారు. కాకపోతే సినిమాలో కాదు. ఓ మ్యూజిక్ వీడియోలో. తేరే బినా అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ని పాడింది, డైరెక్ట్ చేసింది అంతా సల్మాన్ ఖానే కావడం విశేషం. తాజాగా కండలవీరుడు ఈ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. 

కామంతో నటికి ప్రైవేట్ పార్ట్స్ దృశ్యాలు పంపాడు.. ఆమె ఏం చేసిందంటే..

ఈ లాక్ డౌన్ సమయంలో కాస్త మీకు వినోదం అందించేందుకు ఈ వీడియో చేసినట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఈ సాంగ్ షూట్ మొత్తం ఫామ్ హౌస్ లోనే జరిగింది. ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ రొమాన్స్ అలరిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని అభిమానులు అంటున్నారు. 

ఇక ఈ  వీడియోలో సల్మాన్ ఖాన్ గడ్డం లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జాక్వెలిన్ కూడా ఆకర్షించే కాస్ట్యూమ్స్ ధరించింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.